శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (09:27 IST)

చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు... లోకేశ్ బండారం బయటపెట్టాడు...

ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడును ప్రశ్నించారు. అందులో ఒక ట్వీట్ వివరాల్లోకి వెళ్తే... 'ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి

ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడును ప్రశ్నించారు. అందులో ఒక ట్వీట్ వివరాల్లోకి వెళ్తే... 'ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి నమస్కారాలు, మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. శ్రీ కిమిడి కళావెంకట్రావుగారి దగ్గరి నుంచి వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు. అందులో మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో రాష్ట్రం మేలు గురించి పోరాడాలని మీరు అడిగారు. రాష్ట్రానికి మేలు జరగాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేశాం.
 
కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేయిని వెనకమాలుగా మీడియా శక్తులతో చంపించివేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మటం? మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీకు అండగా నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం... ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌ను వేదికగా చేసుకుని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ-9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఇతర కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియా ద్వారా నా మీద, నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు, జరుపుతున్నారు.
 
అందులోభాగంగా గత కొద్ది రోజులుగా (రూ.10 కోట్ల డబ్బు ఖర్చుపెట్టి మరీ) నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డుమీద అసభ్యంగా పచ్చిబూతులు తిట్టించి, దానిని పదేపదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి, దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్‌లో పెట్టి.. ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలి? వర్మ అనే దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (టీవీ9 ఓనర్) ఐన శ్రీనిరాజు (రూ.10 కోట్లు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 రవిప్రకాశ్ (మీడియా డిజైన్) వీరు ముగ్గురి ద్వారా మీ అబ్బాయి అయిన లోకేష్, అతని స్నేహితుడైన కిలారు రాజేష్ కలిసి చేస్తున్నది మీకు తెలియదంటే నమ్మమంటారా?' అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.