మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 19 ఏప్రియల్ 2018 (17:38 IST)

రాత్రి నీ వీడియో చూశాను వర్మా... ఛీ.. నీ అంత...: అల్లు అరవింద్

శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టా

శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టమని చెప్పింది నేనే అంటూ రాంగోపాల్ వర్మ చెబుతూ విడుదల చేసిన వీడియో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ... రాంగోపాల్ వర్మ నా టార్గెట్. ఆలిండియా డైరెక్టర్ అయి బాంబే వెళ్లాడు. తల్లిగా భావించాల్సిన తెలుగు ఇండస్ట్రీకి ఎంత ద్రోహం చేస్తున్నాడో చెప్పేందుకే వచ్చాను.
 
రాత్రి రాంగోపాల్ వర్మ వీడియోను చూశాను. ఓ హీరోతో మాట్లాడాను. మన ఇండస్ట్రీలో ఇంత చెడ్డపేరు వస్తుంది ఎందుకని బాధపడ్డాను. ఛాతి విరుచుకుని బాహుబలి తీసింది మేమే అని ప్రపంచానికి చాటిచెప్పిన తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. ఆర్జీ.. రాత్రి నీ వీడియో చూశానయ్యా. చాలా చండాలమైన మాటను శ్రీరెడ్డితో అనిపించేందుకు ప్రయత్నించావ్.
 
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యమని శ్రీరెడ్డిని అడిగాడు. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం తెలియడంతో పాటు ఆమె మాట్లాడిన టేపు ఒకటి బయటకు రావడంతో భయపడిపోయిన ఆర్జీవి అప్పటికప్పుడు ఓ వీడియో క్రియేట్ చేసి దాన్ని జనంలో వదిలాడు. ఆర్జీవి నీచపు, వెధవ నాటకం, బూటకం ఎవరికి తెలియదు.
 
సురేష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడా. వాళ్లు డబ్బు మాటే ఎత్తలేదు. ఇకపోతే నీ విషయం. నీకు మాత్రం రూ. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. పవన్ కళ్యాణ్, అభిమానులపై వున్న కసిని తీర్చుకునేందుకు ఇలా చేస్తావా? నీది నీచమైన మనస్తత్వం అని అందరికీ తెలిసిందే. నీపై ఇండస్ట్రీ ఎందుకు చర్య తీసుకోకూడదు. సాఫ్ట్ మర్డర్స్ చేసే క్రిమినల్‌వి. పిచ్చివాడా... నువ్వు ఏం చేయాలన్నా నీవల్లకాదు. ఇప్పుడున్న మీడియావేరు. పదేళ్ల క్రితం వున్న పరిస్థితులు వేరు అని గుర్తుంచుకో'' అని అరవింద్ చెప్పారు.