సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (15:57 IST)

శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు? ''మా'' పరువు పోతోంది : మంచు విష్ణు

టాలీవుడ్‌లో సంచలనంగా మారిన శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు.. మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారంటూ.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు హీరో విష్ణు ప్రశ్నించాడు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియే

టాలీవుడ్‌లో సంచలనంగా మారిన శ్రీరెడ్డిపై ఎవరిని అడిగి నిషేధం విధించారు.. మళ్లీ ఎవర్నడిగి నిషేధం ఎత్తివేశారంటూ.. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు హీరో విష్ణు ప్రశ్నించాడు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై మంచు విష్ణు నిప్పులు చెరిగాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో మా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. 
 
మా అధ్యక్షుడు శివాజీరాజాకి లేఖాస్త్రం సంధించిన మంచు విష్ణు శ్రీరెడ్డి ఇష్యూలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవహరించిన తీరును నిలదీశారు. అసలు మాకెందుకు చెప్పలేదంటూ మంచు విష్ణు ఘాటుగా ప్రశ్నించారు. మాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గందరగోళంగా వున్నాయన్నారు.


900మంది ఉన్న ''మా''లో తమ కుటుంబ సభ‌్యులు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా మంచు విష్ణు గుర్తు చేశారు. అనాలోచిత నిర్ణయాలతో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌పై ప్రజల్లో చులకన భావన ఏర్పడుతోందని మంచు విష్ణు ఘాటు కామెంట్స్‌ చేశారు.
 
అసలు నటీనటులకు సరైన మార్గదర్శకాలు ఎక్కడున్నాయంటూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌ను మంచు విష్ణు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 24 క్రాఫ్ట్‌లకు కూడా ఆ మార్గదర్శకాలను వర్తింపజేయాలని మంచు విష్ణు కోరాడు.

ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వంలేని అనేకమంది స్థానిక నటులు ఉన్నారని వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు. కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు టాలీవుడ్‌ పరువు తీసేస్తోందన్న విష్ణు ఫిర్యాదుల సెల్‌ ఏర్పాటు బాధ్యతను "మా" కాకుండా ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకోవాలని కోరారు.