మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (19:48 IST)

సంధ్య గారూ తమాషాగా వుందా..? ఆధారాలు చూపెట్టండి: జీవిత రాజశేఖర్

టీవీల్లో కాస్టింగ్ కౌచ్‌పై డిబేట్లు జరుగుతుంటే.. చాలా అభ్యంతరకరంగా చీఫ్‌గా అనిపించిందని.. తనను రమ్మని పిలిచినా వెళ్లేది లేదని సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత రాజశేఖర్‌ తెలిపాకు. సామాజిక వేత్త సంధ్య చేసిన

టీవీల్లో కాస్టింగ్ కౌచ్‌పై డిబేట్లు జరుగుతుంటే.. చాలా అభ్యంతరకరంగా చీఫ్‌గా అనిపించిందని.. తనను రమ్మని పిలిచినా వెళ్లేది లేదని సినీనటి, ప్రొడ్యూసర్‌ జీవిత రాజశేఖర్‌ తెలిపాకు. సామాజిక వేత్త సంధ్య చేసిన ఆరోపణలపై జీవిత మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.


అసలు ఎవరికి ఏం కావాలని ఫైట్‌ జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. కొన్ని రోజుల ముందు తాను మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్‌ చూశానని, సామాజిక కార్యకర్త సంధ్య ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై నీచమైన ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. 
 
సంధ్య మహిళల కోసం పోరాడుతుందని అందరూ అంటారని, సంధ్య కూడా ఒక మహిళ అని, అటువంటి ఆమె ఇంత దారుణంగా ఎలా ఆరోపణలు చేస్తుందని జీవిత అడిగారు. తాను హాస్టల్‌ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్‌ వద్దకు పంపుతున్నానని సంధ్య చెప్పింది. మహాన్యూస్‌లో మూర్తి అనే ఎడిటర్‌ ఆ చర్చ జరిపేసి, అమీర్‌పేటలోని హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్‌ వద్దకు పంపుతున్నానని వారికి వారే తేల్చేసినట్లు ప్రకటించుకున్నారని విమర్శలు గుప్పించారు. 
  
తనపై, తన కుటుంబంపై అసత్య ఆరోపణలను ప్రసారం చేసిన ప్రముఖ న్యూస్‌ ఛానల్‌పైన, సామాజిక కార్యకర్త సంధ్యపైన కేసులు పెడతానని జీవిత రాజశేఖర్‌ ప్రకటించారు. అంతేగాకుండా గురువారం తమ లాయర్‌తో కలిసి మళ్లీ మీడియా ముందుకు వస్తానన్నారు. తన వెనుక ఎవరు వచ్చినా, రాకపోయినా తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. దర్శకుడు దాసరి నారాయణ రావు ఉండి ఉంటే ఈ సమస్యను పరిష్కరించేవారని, ఆయన లేకపోవడం పెద్ద లోటేనని జీవిత తెలిపారు. 
 
తాను టీవీల చర్చలకు వెళ్లి చర్చలు జరపబోమని, ఎందుకంటే టీవీ ఛానెళ్లు తమ రేటింగ్స్‌ పెంచుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసి, రేటింగ్స్‌ పెంచుకోవడానికే ప్రయత్నించి కొన్నింటిని మాత్రమే హైలైట్‌ చేసి చూపిస్తాయని జీవిత ఆరోపించారు. తాను ప్రజలకు నిజాలు తెలపాలనే ఉద్దేశంతోనే ఇలా మీడియా ముందుకు వచ్చానని, టీవీ డిబేట్లకు వెళ్లలేదన్నారు. 
 
ఇంకా సామాజిక కార్యకర్త సంధ్యకు తమాషాగా వుందా.. ఆమె వద్ద ఉన్న ఆధారాలేంటో చూపించాలని జీవిత సవాల్ విసిరారు. సినిమా వారిపై చీఫ్ వ్యాఖ్యలు చేస్తున్నారని.. సంధ్య చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని.. కోర్టుకు వెళ్తానని జీవిత హెచ్చరించారు.