మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 16 జూన్ 2018 (21:01 IST)

అఖిల్ - వెంకీ మూవీ ప్రారంభం ఎప్పుడు..?

అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హ‌లో సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో... ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్

అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హ‌లో సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో... ఈసారి ఖ‌చ్చితంగా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రెండు నెలల పాటు యుకెలో జరుగనుందన్న విషయం తెలిసిందే. అయితే... ఈ నెల మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగాల్సి ఉండగా వీసా కారణాల వల్ల వాయిదా పడింది.
 
ఇప్పుడు ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఈ సినిమాకి  మిస్టర్ మజ్నుఅనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి... ఈ సినిమా అయినా అఖిల్‌కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం!