సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (13:52 IST)

''టై ఎక్కడ'' అని అడిగిన చైతూ.. సమంత ఏం చేసిందంటే? (video)

''ఏమాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి వెండితెర తారలుగా మారిపోయిన నాగచైతన్య-సమంత గత ఏడాది అక్టోబరులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ.. హిట్స్ కొడుతున్న సమంత..

''ఏమాయ చేసావె'' సినిమాతో తెరంగేట్రం చేసి వెండితెర తారలుగా మారిపోయిన నాగచైతన్య-సమంత గత ఏడాది అక్టోబరులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ.. హిట్స్ కొడుతున్న సమంత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. 
 
ఈ వీడియోలో నాగచైతన్య పెళ్లికొడుకులా తయారవుతూ ''టై ఎక్కడ..'' అని నవ్వుతూ అఖిల్‌ని అడగడం కనబడుతుంది. అలాగే వీ కెన్ డూ దిస్..వీ కెన్ డూ దిస్ అంటూ సమంత పాడుతూ డ్యాన్స్ చేయడం.. చైతూ, సమంత పెళ్లి దుస్తుల్లో మెరిసే సన్నివేశాలు.. అక్కినేని నాగార్జునతో సమంత ఆప్యాయంగా మాట్లాడే సన్నివేశాలు అదుర్స్ అనిపించాయి. 
 
ఇక ''మీకు ప్రామిస్ చేసినట్టుగానే చై-సామ్ పెళ్లిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఇంత బాగా వీడియో తీసిన జోసెఫ్, రాధిక్‌కు ధన్యవాదాలు. దేశంలోనే మీరు బెస్ట్'' అని సమంత చెప్పింది. ఈ వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.