శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (17:36 IST)

శివునికి అభిషేకం చేయిస్తే చాలు.. అన్నీ శుభఫలితాలే

ఈతిబాధలు వేధిస్తున్నాయా? వ్యాపారాల్లో లాభాలు చేకూరట్లేదా? వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా? సంతాన ప్రాప్తి కలుగలేదా? అయితే శివునికి అభిషేకం మాత్రం చేయిస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున

ఈతిబాధలు వేధిస్తున్నాయా? వ్యాపారాల్లో లాభాలు చేకూరట్లేదా? వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా? సంతాన ప్రాప్తి కలుగలేదా? అయితే శివునికి అభిషేకం మాత్రం చేయిస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. 
 
మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలను సంతరించుకుంటుంది. ఆవుపాలతో శివునికి అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి. పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి. 
 
మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేయించిన వారికి నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు. పెరుగుతో శివునికి అభిషేకం చేయిస్తే..  ఆరోగ్యం చేకూరుతుంది. పంచదారతో చేయిస్తే దుఃఖం తొలగిపోతుంది. రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.