గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (14:15 IST)

వేసవిలో బెండకాయ పచ్చడిని తీసుకుంటే..

వేసవికాలంలో బెండకాయ పచ్చడిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెండలో విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు, మినరల్స్

వేసవికాలంలో బెండకాయ పచ్చడిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెండలో విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు, మినరల్స్ అధికంగా వుండటం ద్వారా అనారోగ్య సమస్యలను బెండకాయలు దూరం చేస్తాయి. అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడంలో బెండకాయ తోడ్పడుతుంది. 
 
ప్రతిరోజూ బెండకాయను అరకప్పు తీసుకుంటే అందులోని ఫైబర్, విటమిన్-సి చర్మానికి మేలు చేస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వేసవిలో అలసట, నీరసాన్ని దరిచేరనివ్వదు. ఇక మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వీటిల్లో విటమిన్‌-కె ఉండడంవల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బెండకాయల్ని రోజూ తినేవారిలో కీళ్లనొప్పులుండవు. 
 
ప్రతిరోజూ బెండకాయ తినడంవల్ల పెద్దపేగులో వచ్చే కేన్సర్‌ బారినపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఉబ్బసం ఉన్నవారు వీటిని తినడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.