శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By kowsalya
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:49 IST)

జిడ్డు చర్మానికి కర్పూరం - తేనె మిశ్రాన్ని రాస్తే...

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య

వేసవికాలంలో ఎండతీవ్రత కారణంగా చెమట ఎక్కువగా పోస్తుంది. ముఖ్యంగా, ఉక్కపోత వల్ల చర్మం జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటివారు చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
జిడ్డు చర్మానికి కొంచెం కర్పూరం, ఒక స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని మీ చర్మం పై మృదువుగా రాసుకొని ఐదు నిమిషాలు తర్వాత కడగండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తేమను సంతరించుకుంటుంది. అలాగే, రక్త ప్రసరణకు చాలా మెరుగు పడుతుంది. మీది పొడి చర్మమైతే అందులో ఒక స్పూన్ తేనె, బాదం నూనెను కొంచెం కలిపి రాసుకున్నట్లైతే మంచి ఫలితాలు లభిస్తాయి.