శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (22:06 IST)

కలబందతో అందం... ఎలాగో తెలుసా?

కలబంద వలన మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద కురుల సంరక్షణకు, ఎనర్జీ డ్రింకుల్లో, రకరకాల పుడ్స్ తయారుచేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. వైద్యపరంగా కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉంది. అంద

కలబంద వలన మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద కురుల సంరక్షణకు, ఎనర్జీ డ్రింకుల్లో, రకరకాల పుడ్స్ తయారుచేయడంలో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. వైద్యపరంగా కూడా దీనికెంతో ప్రాధాన్యత ఉంది. అందానికైతే ఇక చెప్పనక్కర్లేదు. దీనితో రకరకాల ఫేస్ ప్యాక్‌లను తయారుచేసుకోవచ్చు.
 
1. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు రెండు టీ స్పూన్ల కలబంద జెల్, రెండు టీ స్పూన్ల జున్ను, గింజలు లేని ఖర్జారాలు ఐదు, దోసకాయ ముక్కలు, నిమ్మరసం వీటన్నింటిని కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ పేస్టును కొద్దిగా తీసుకొని ముఖానికి, మెడ భాగానికి రాసుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మెుదట చల్లని నీళ్లతో ముఖం కడుక్కొని, ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కూడా ముఖం, మెడభాగాలు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రిజ్‌లో పెట్టుకొని వాడుకుంటూ ఉండవచ్చు.
 
2. దోసకాయ రసం, కలబంద జెల్, పెరుగు, రోజ్ వాటర్, ఎసెన్షియల్ ఆయిల్ ఇవన్నీ కలిపి మెత్తగా ఫేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు పెట్టుకొని పది నిమిషాలపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పేస్టు చర్మానికి రాసుకోవడం వల్ల మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.
 
3. కలబంద ఆకును తీసుకొని దాన్ని కొద్ది నీళ్లలో ఉడికించాలి. ఆ తర్వాత అందులో తేనె కలపాలి. ఆ పేస్టును ముఖానికి, మెడకు పూసుకొని 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా చేస్తే చర్మం జిడ్డుగా ఉండకుండా మిలమిలా మెరుస్తుంటుంది.