1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. barley seeds health benefits,

గుండెపోటుకు బార్లీ గింజలు తీసుకుంటే?

బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ బార్లీ గింజలను ఆహారంలో ఎక్కువగా తీసుకోరు. ఈ బార్లీ గింజల్లోని పోషకాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీస

barley seeds health benefis
బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ బార్లీ గింజలను ఆహారంలో ఎక్కువగా తీసుకోరు. ఈ బార్లీ గింజల్లోని పోషకాలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం రక్తపోటు అదుపులో ఉంటుంది. బార్లీలో పీచు పదార్థాలు కూడా ఎక్కువే. జీర్ణాశయపు ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతాయి.
 
అంతేకాకుండా రక్తంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తాయి. తద్వారా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ కారణం వలనే అవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుంది. ఈ బార్లీ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెజబ్బులను, గుండెపోటును నివారిస్తాయి. బార్లీలోని విటమిన్ ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా ఉంచుతాయి. 
 
ఈ గింజల్లోని ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు చర్మానికి, వెంట్రుకలకు మెరుపునిస్తాయి. ఈ గింజల్లోని విటమిన్ బి, సి వ్యాధి నిరోధకశక్తిని పెంచుటలో మంచిది సహాయపడుతాయి. బార్లీ గింజల్లోని ఐరన్ శాతం రక్తహీనతను నివారిస్తాయి. అంతేకాకుండా బార్లీలో ఉండే క్యాల్షియం, పాస్పరస్ ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతాయి. 
About Writer
Kowsalya
తర్వాతి కథనం
ఉదయాన్నే గ్లాస్ నీటిలో పసుపును కలుపుకుని తీసుకుంటే?