సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (14:41 IST)

నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే?

నల్లతులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి.. ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంట

నల్లతులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి.. ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవినొప్పికి మంచి మందు పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది. 
 
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవై ఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది. తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. 
 
పొద్దునే అల్పాహారానికి అరగంట ముందు తులసీ రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాలపొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.