సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (12:59 IST)

డాడీ ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ఎంకే స్టాలిన్ : నేడు రాహుల్ రాక

తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ వెల్లడించారు.

తీవ్ర అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ వెల్లడించారు. అందువల్ల డీఎంకే కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. ఎలాంటి ఆందోళనలు, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.
 
ఇకపోతే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కూడా కరుణానిధి ఆరోగ్యంపై స్పందిస్తూ, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని... ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. మరోవైపు, కరుణ అనారోగ్యం నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులకు సెలవులను రద్దు చేశారు. 
 
ఇదిలావుంటే, చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డీఎంకే చీఫ్ కరుణానిధిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. కరుణానిధిని చూసేందుకు రాహుల్ ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లనున్నారు. సోమవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెన్నైకు వచ్చి కరుణానిధిని పరామర్శించిన విషయం తెల్సిందే.