మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (13:22 IST)

ఉసిరికాయతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం...

ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ ఉసిరిలో క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్ బి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి నీరసం, అలసటను తగ్గిస్తాయి. ఇటువంటి ఉసిరికాయతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం.

ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ ఉసిరిలో క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్ బి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి నీరసం, అలసటను తగ్గిస్తాయి. ఇటువంటి ఉసిరికాయతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
ఉసిరికాయలు - ఆరు 
కందిపప్పు - 1 కప్పు 
పసుపు - 1 స్పూన్ 
సాంబారుపొడి - 2 స్పూన్స్
పచ్చిమిర్చి - 4 
ఇంగువ - చిటికెడు 
ఉప్పు - తగినంత 
నూనె - 2 స్పూన్స్  
కొత్తిమీర తురుము - 2 స్పూన్స్ 
ఎండుమిర్చి - 2 
ఆవాలు - 1 స్పూన్ 
కరివేపాకు - 2 రెబ్బలు
 
తయారీ విధానం: 
ముందుగా కందిపప్పును మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయల్ని కడిగి ముక్కలుగా కోసి గింజలు తీసి మెత్తగా ఉడికించాక అందులోనే పసుపు, పచ్చిమిర్చి వేసి మెదపాలి. తరవాత ఈ ముద్దను ఉడికించిన కందిపప్పులో వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు, సాంబారుపొడి వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులతో పోపు చేసి సాంబారులో కలిపితే వేడివేడి ఉసిరి సాంబార్ రెడీ.