1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Amazing health benefits of turmeric

ఉదయాన్నే గ్లాస్ నీటిలో పసుపును కలుపుకుని తీసుకుంటే?

వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల వలన అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్స్, ఫ్లూ వంటి వ్యాధులు వస్తుంటాయి. వాతావరణం చల్లగా ఉండడ వలన బ్యాక్టీరియా, వైరస్‌లు వృద

health
వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల వలన అనారోగ్యాల పాలవుతున్నారు. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్స్, ఫ్లూ వంటి వ్యాధులు వస్తుంటాయి. వాతావరణం చల్లగా ఉండడ వలన బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో అల్లం చాలా ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి తలనొప్పి, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఈ కాలంలో అధికంగా అల్లాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 
ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చిటికెడు పసుపును కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీయల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. గ్లాస్ నీటిలో స్పూన్ నిమ్మరసం, తేనె కలుపుకుని తీసుకుంటే వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు.
 
నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా కాపాడుతాయి. నిత్యం నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
దశరథుడికి ఎంతమంది కొడుకులు?