మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (14:43 IST)

ప్రతిరోజూ పొన్నగంటి ఆకుకూరను తీసుకుంటే?

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగ పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పొన్నగంటి క

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పొన్నగంటి కూరను కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారట. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి.
 
అందువలన రక్తం అశుభ్రమైపోతుంది. కాబట్టి రక్తాన్ని శుభ్రం చేసుకునేందుకు పొన్నగంటి ఆకును, పెసరపప్పు, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు పొడి చేర్చి ఉడికించిన మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ కూరను తీసుకోవడం వలన శరీరఛాయను మెరుగుపరచుటకు సహాయపడుతుంది. 
 
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి సమస్యలు తొలగిపోవాలంటే పొన్నగంటి ఆకులతో తాలింపు కూర చేసుకుని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. గుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది.