శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (16:19 IST)

తితిదే పాలక మండలి సభ్యుడుగా సుదర్శన్ వేణు నియామకం

Tirumala
తితిదే పాలక మండలిలో కొత్త నియామకం చోటుచేసుకుంది. బోర్డులో కొత్త సభ్యుడుగా ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ వేణును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తితిదే పాలక మండలి సభ్యుడుగా జస్టిస్ హెచ్.ఎల్.దత్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో కొత్తగా మరో సభ్యుడుని నియమించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గతంలో రాష్ట్ర ప్రభుత్వ 29 మందితో తితిదే పాలక మండలిని ఏర్పాటుచేసింది. అయితే, అప్పట్లో సభ్యుడుగా ఎంపికై జస్టిస్ట హెచ్.ఎల్.దత్తు తన బాధ్యతలను స్వీకరించారు. దీంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే కొనసాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 29వ సభ్యుడి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దత్తు స్థానంలో సుదర్శన్ వేణు నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నియామకంతో తితిదే పాలకమండలి పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టయింది. తర్వరలోనే సుదర్శన్ వేణు సభ్యుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుదర్శన్ వేణు ప్రస్తుతం టీవీసీ మోటార్స్ ఎండీగా ఉన్న విషయం తెల్సిందే.