శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By Kowsalya
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (16:29 IST)

అల్లాహ్ సాక్షిగా ఇచ్చిన మాట... నిలబెట్టుకున్నాడా?

ఒక వ్యక్తికి అవసరం నిమిత్తం కొంత సొమ్ము కావలసి వచ్చింది. అతను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. తన అవసరాన్ని వివరించి, నాకు వేయి వరహాలు అప్పుగా కావాలసి అడుతాడు. ఆ వ్యక్తి జమానతుగాని, సాక్ష్యం గాని తీసుకురమ

ఒక వ్యక్తికి అవసరం నిమిత్తం కొంత సొమ్ము కావలసి వచ్చింది. అతను ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. తన అవసరాన్ని వివరించి, నాకు వేయి వరహాలు అప్పుగా కావాలసి అడుతాడు. ఆ వ్యక్తి జమానతుగాని, సాక్ష్యం గాని తీసుకురమ్మంటాడు. అప్పుడు అతను అల్లాహ్‌ను సాక్షిగా జమానతుగా పెడుతున్నానని ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి కూడా అల్లాహ్ భక్తుడే కనుక అతని మాటను నమ్మి దైవసాక్షిగానే అతనికి కాలవసిన వేయి వరహాలను ఇస్తాడు.
 
తరువాత అతను వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు. కొంతకాలం తరువాత అప్పు తీర్చాల్చిన సమయం దగ్గరపడింది. అతను అప్పుడు కట్టాల్సిన మెుత్తాన్ని తీసుకుని స్వదేశానికి ప్రయాణమయ్యాడు. కానీ సమయానికి ఓడ అందుబాటులో లేకుండా పోయింది. ఇంకొన్ని రోజున గడిచాయి. అప్పు తీర్చాల్చిన సమయం వచ్చేసింది. 
 
నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోతున్నానన్న బాధతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తరువాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే కలం, కాగితం తీసి అప్పుకట్టాల్సిన వ్యక్తికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంతో పాటు వేయి వరహాలను ఒక చిన్న చెక్కపెట్టెలో పెట్టి దైవనామాన్ని స్మరిస్తూ సముద్రంలో వదిలేశాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అతను వస్తాడని ఓడ రేవు దగ్గరికి వచ్చాడు.
 
కాని ఎంత ఎదురు చూసినా ఓడ మాత్రం కాలేదు. ఇక ఆ వ్యక్తి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అంతలో ఏదో చెక్కపెట్టి తీరం వెంబడి కొట్టుకు రావడం ఆ వ్యక్తికి కనిపించింది. దాంతో ఆ వ్యక్తి ఆసక్తిగా దాన్నే గమనిస్తూ దగ్గరికి రాగానే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో వేయి వరహాలతోపాటు, అతని పేరు రాసిన ఉత్తరం కనిపించింది. 
 
కొన్ని రోజుల తరువాత అప్పు తీసుకున్న ఆ వ్యక్తి కూడా వచ్చేశాడు. అతను నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనందుకు పశ్చాత్తాపం పడుతుంటాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అతను పంపిన ఉత్తరాన్ని, వేయి వరహాలను చూపించి అతని నిజాయితీ పట్ల నిబద్ధతను ఎంతగానో ప్రశంసించాడు. మనసా, వాచా, కర్మణా దైవాన్ని విశ్వసించి, ఎవరి హక్కును వారికి నెరవేర్చాలన్న సంకల్పం ఉన్నవారికి దైవసహాయం తోడుంటుంది.