మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (16:04 IST)

అక్టోబర్ 20న ఆప్ఘన్ ఎన్నికలు.. కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి

ఆప్ఘనిస్తాన్‌లో అక్టోబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌లో షియా తెగకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో మళ్

ఆప్ఘనిస్తాన్‌లో అక్టోబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌లో షియా తెగకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో మళ్లీ నెత్తురు పారింది. కాబూల్‌లో ఎడ్యుకేషనల్ సెంటర్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  
 
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే మారణహోమం సృష్టిస్తున్నారు. ఐతే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఇటీవల ఘాజ్ని నగరంపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. భద్రతా దళాలే టార్గెట్‌గా మెరుపు దాడికి పాల్పడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య ఐదు రోజుల పాటు భీకర కాల్పులు జరిగాయి. తాలిబన్ల దాడిలో 140 మంది భద్రతా సిబ్బంది, 60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.