గణపతికి ''ఏక దంతుడు'' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఓసారి పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి వచ్చాడు. అతను నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడ వినాయకుడు అడ్డుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చిన తరువాతనే లోపలికి పంపిస్తానని
ఓసారి పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి వచ్చాడు. అతను నేరుగా లోపలికి వెళ్లబోతుండగా అక్కడ వినాయకుడు అడ్డుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చిన తరువాతనే లోపలికి పంపిస్తానని చెప్పాడు. పరశురామునికి వినాయకుని ధోరణ ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అప్పుడు పరశురాముడు ఇలా అంటారు.
పార్వతీ పరమేశ్వరులకు నేను కూడా పుత్రుడినేనని, నా తల్లిదండ్రుల దర్శననానికి అనుమతి అవసరం లేదని పరశురాముడు లోపలికి వెళ్లబోతాడు. వినాయకుడు ఎంతగా చెప్పిన వినిపించుకోకపోవడంతో తన తొండంతో పరశురాముని గట్టిగా చుట్టేసి గిరగిరా తిప్పుతూ సప్త సముద్రాల్లో ముంచేసి మళ్లీ కైలాసానికి తీసుకొస్తాడు.
ఆ తరువాత పరశురాముడు ఆగ్రహంతో తన చేతిలోని గొడ్డలిని గణపతిపై విసురుతాడు. దాంతో గణపతికి దంతం విరిగిపోతుంది. అంతలో పార్వతీపరమేశ్వరులు బయటకి వస్తారు. అదే సమయంలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. గణపతి గాయం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతిని బాధపడొద్దనీ చెప్పి, ఇక గణపతి ఏకదంతుడు అనే పేరుతో పిలువబడుతాడని సెలవిస్తాడు.