ఇంట్లో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారా... ఆ ప్రాంతాల్లో నిమ్మరసాన్ని చల్లుకుంటే?
ఈ కాలంలో కురిసే వర్షాల వలన ఇంట్లో, అల్మారాల్లో, గోడల్లో చెమ్మగా ఉంటుంది. ఇక బట్టలన్నీ దుర్వాసనతో నిండిపోతాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. చెమ్మ వలన
ఈ కాలంలో కురిసే వర్షాల వలన ఇంట్లో, అల్మారాల్లో, గోడల్లో చెమ్మగా ఉంటుంది. ఇక బట్టలన్నీ దుర్వాసనతో నిండిపోతాయి. ఇలాంటి సమస్యలను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. చెమ్మ వలన కలిగే దుర్వాసనకు ముఖ్యకారణం సూక్ష్మజీవులు, ఫంగస్. నిమ్మరసంలో ఈ రెండు పదార్థాలు అధికంగా ఉంటాయి.
వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ఇంట్లో దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో చల్లుకుంటే మంచిది. ఉప్పును బట్టలో మూటలా కట్టుకుని ఇంట్లో దుర్వాసన వచ్చేచోటు ఉంచుకుంటే తేమ వాసన తగ్గుతుంది. నిమ్మరసం కలిపిన నీటితో గదులను శుభ్రం చేసుకుంటే దుర్వాసన తొలగిపోతుంది.
వెనిగర్‌ను ఇల్లంతా చల్లుకుని శుభ్రం చేసుకుంటే కూడా దుర్వాసన పోతుంది. బట్టలను ఉతికిన తరువాత వాటిని మరోసారి కొద్దిగా నీళ్ళలో నిమ్మరసం కలుపుకుని దుస్తులను అందులో ముంచి ఆరేసుకుంటే దుర్వాసన రాదు.