గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:41 IST)

పెనంపై టీ పొడిని చల్లితే దోమలు తొలగిపోతాయట...

ఈ కాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు కారణం దోమలు మాత్రమే. ముఖ్యంగా నిల్వ ఉండే నీటిలో పెరిగే దోమలు ఇంట్లో చేరి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపై దాడి చేస్తాయి. ఈ దోమలు కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ వ

ఈ కాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు కారణం దోమలు మాత్రమే. ముఖ్యంగా నిల్వ ఉండే నీటిలో పెరిగే దోమలు ఇంట్లో చేరి చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిపై దాడి చేస్తాయి. ఈ దోమలు కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తుంటాయి. ఇటువంటి వ్యాధులను నివారించేందుకు ముందుగా దోమలను అరికట్టాలి.
 
మార్కెట్‌ల్లో దొరికే ఎన్నో రకరకాల దోమల నివారణ కాయిల్స్, లిక్విడ్స్, కెమికల్స్ చాలా ఉన్నాయి. కానీ వీటిని అధికంగా ఉపయోగించడం వలన శ్వాస సంబంధమైన వ్యాధులు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే వేడివేడి పెనంపై టీ పొడిని చల్లితే ఆ ఘాటు వాసన భరించలేక దోమలు బయటకు వెళ్లిపోతాయి. అలాకాకుంటే ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని కర్పూరం బిళ్ళలను వేసినా ఆ వాసనతో దోమలు ఇంట్లో రావు. అంతేకాకుండా ఇంటికి దూరంగా ఉంటాయి. 
 
లెమన్‌గ్రాస్, పుదీనా, బంతి మెుక్కలను కుండీలలో ఇంట్లో పెంచినా కూడా దోమలు తొలగిపోతాయి. దోమలు కుట్టిన చోట నొప్పి, దురదగా ఉంటే వెనిగర్‌లో దూదితో ముంచుకుని ఆ గాయాలపై రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పి, దురదలు తగ్గుతాయి.