గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (10:40 IST)

విరాట్ కోహ్లీ షాంపైన్ గిఫ్ట్.. ఎవరికిచ్చారో తెలుసా?

భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో రాణించిన విరాట్ కోహ్లీ తన కోచ్ రవిశాస్త్రికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చాడు. అదేంటంటే.. ఓ షాంపైన్‌ బాటిల్‌. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగ

భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో రాణించిన విరాట్ కోహ్లీ తన కోచ్ రవిశాస్త్రికి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చాడు. అదేంటంటే.. ఓ షాంపైన్‌ బాటిల్‌. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 
 
అవార్డు కింద ట్రోఫీతో పాటు నిర్వాహకులు కోహ్లీకి ఓ ఫాంపైన్‌ బాటిల్‌ని కూడా అందజేశారు. ఈ బాటిల్‌ను తీసుకున్న కోహ్లీ ముందుగా డ్రస్సింగ్‌ రూమ్‌ వెలుపల కూర్చుని ఉన్న కోచ్‌ రవిశాస్త్రి వద్దకు వెళ్లి అతని చేతిలో ఈ బాటిల్ పెట్టాడు. ప్రస్తుతం షాంపైన్ బాటిల్‌ను కోహ్లీ కోచ్‌కు ఇచ్చిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. విరాట్ కోహ్లి తిరిగి ఐసీసీ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 103 రన్స్ చేసిన విరాట్.. స్మిత్‌ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 937 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 
Virat Kohli thanks Ravi Shastri by gifting his champagne to head coach: Report