శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (15:15 IST)

క్రికెట్ ఆడేందుకు వెళ్లారా... హనీమూన్‌కు వెళ్లారా... : నెటిజన్ల ఫైర్

భారత క్రికెట్ జట్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రూపు ఫోటో దిగారు. ఈ ఫోటోను బీసీసీఐ సోషల

భారత క్రికెట్ జట్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రూపు ఫోటో దిగారు. ఈ ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే అసలు చిక్కుకు కారణమైంది.
 
ఈ ఫోటోలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన క్రికెటర్లు ఎక్కడో వెనుక వరుసలో ఉంటే.. భారత సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క మాత్రం ముందు వరుసలో ఉంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఈ ఫోటోలో 'టీమిండియా వైస్ కెప్టెన్ ఎక్క‌డో వెనుక వ‌ర‌స‌లో ఉంటే.. అనుష్క మాత్రం ముందు ఉంది. టీమిండియాకు అనుష్క ఎప్పుడు ఎంపికైంది. ఇంత‌కీ ఆమె బౌల‌రా? బ్యాట్స్‌మెనా?, ఇది క్రికెట్ టూరా? లేక‌పోతే హనీమూన్ టూరా?, ఇదేమైనా ఫ్యామిలీ ఫంక్ష‌నా? అనుష్క‌కు ఇంత ప్రాధాన్యం ఎందుకు' అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఇది వైరల్ అయింది.