శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (15:53 IST)

'జో యా ఫ్యాక్టర్'... దుల్కర్ సల్మాన్ రోలేంటో తెలుసా?

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ పోషించనున్నాడు. బాలీవుడ్‌లో అనుజా చౌహాన్ నవల ఆధారంగా జో యా ఫ్యాక్టర్ అనే చిత్రం

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ పోషించనున్నాడు. బాలీవుడ్‌లో అనుజా చౌహాన్ నవల ఆధారంగా జో యా ఫ్యాక్టర్ అనే చిత్రం తెరకెక్కుతోంది. అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్‌ యువతి విధుల్లో భాగంగా ఓసారి టీమిండియాను కలుసుకుంటుంది. 
 
రాజ్‌పుత్ యువతి టీమిండియా కలవడం.. ఆపై జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవడం జరుగుతుంది. దీంతో ఆ యువతి భారత జట్టుకు లక్కీ గర్ల్‌గా మారిపోతుందట. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఇక దుల్కర్ ఇప్పటికే బాలీవుడ్‌లో కార్వాన్ అనే మూవీతో అరంగేట్రం చేశాడు. 
 
ఈ సినిమా తర్వాత దుల్కర్ చేస్తున్న రెండో చిత్రం ''జో యా ఫ్యాక్టర్''. ఇందులో కోహ్లీ పాత్రలో దుల్కర్ కనిపిస్తాడట. ఇక తెలుగులో ఇటీవల విడుదలైన ''మహానటి'' మూవీతో దుల్కర్ సల్మాన్ మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.