శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (14:39 IST)

"రెండు శవాలు.. ముగ్గురు వ్యక్తులు.. తప్పిపోయిన ఓ యువతి" .. #KarwanOfficialTrailer

విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్, "మహానటి" ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన బాలీవుడ్ మూవీ "కర్వాన్" ట్రైలర్ బుధవారం రిలీజైంది. ముగ్గురు వ్యక్తులు.. రెండు శవాలు.. ఓ తప్పిపోయిన యువతి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవ

విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్, "మహానటి" ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన బాలీవుడ్ మూవీ "కర్వాన్" ట్రైలర్ బుధవారం రిలీజైంది. ముగ్గురు వ్యక్తులు.. రెండు శవాలు.. ఓ తప్పిపోయిన యువతి కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తిని రేపుతోంది.
 
గంగోత్రి యాత్రకు వెళ్లి చనిపోయిన తన తండ్రి శవాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్లిన అవినాష్ (దుల్కర్ సల్మాన్)కు తన తండ్రి మృతదేహం బదులు పొరపాటున మరో వృద్ధ మహిళ శవం దొరుకుతుంది. తన తండ్రి శవం పొరపాటున కొచ్చి వెళ్లిందని తెలుసుకొని అక్కడికి బయలుదేరిన తర్వాత.. ఊటీ వెళ్లి ఓ యువతి తప్పిపోయిందని అవినాష్‌కు తన తల్లి నుంచి సమాచారం అందుతుంది. 
 
తప్పిపోయిన యువతి తాన్యాగా మిథిల, వీళ్లకు సహకరించే డ్రైవర్ షౌకత్‌గా ఇర్ఫాన్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ జర్నీలో వీళ్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ ఆసక్తికర స్టోరీకి కాస్త హాస్యాన్ని జోడించారు. ఈ చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించగా, ఈ సినిమా ఆగస్టు 3వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.