శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By selvi
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (13:23 IST)

నయనతార యాక్షన్ అదుర్స్.. ఇమైక్కా నొడికల్ ట్రైలర్ మీ కోసం.. (వీడియో)

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార లేడి ఓరియెంటెడ్ సినిమా కర్తవ్యం బిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ''ఇమైక్కా నొడిగ‌ల్'' అనే చిత్రం చేస్తుంది. ఈ సిన

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార లేడి ఓరియెంటెడ్ సినిమా కర్తవ్యం బిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ''ఇమైక్కా నొడిగ‌ల్'' అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ హీరోయిన్‌గా నయనతార కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రిలీజ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 
 
సైకో చేసే వరుస హత్యలు భయాందోళనలు కలిగిస్తూ వుంటే, అతని కోసం అన్వేషించే ఆఫీసర్ పాత్రలో నయనతార యాక్షన్ బాగుంది. ఇక ఈ సినిమాలో అధర్వ, రాశిఖన్నా యువ ప్రేమ జంటగా అదరగొట్టేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు సమాచారం. 
 
న‌య‌న‌తార భ‌ర్త‌గా ప‌దిహేను నిమిషాలు విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌నున్నట్లు దర్శ‌కుడు తెలిపారు. ఇద్ద‌రి మీద ఓ సాంగ్ కూడా చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిలీజైన ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.