1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Ahmedabad plane crash: DNA confirms identities of 31 victims; 12 bodies handed over

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

plane crash
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 241 మంది విమాన ప్రయాణికులు ప్రాణాలు కో్ల్పోగా, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 31 మంది మృతదేహాలను గుర్తించి, 12 కుటుంబాలకు అప్పగించారు. 
 
అలాగే, ప్రమాదంలో గాయపడిన మరో 13 మందికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో ఫోరెన్సిక్ బృందాలు నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఇంకా గుర్తించాల్సిన మృతదేహాల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహం కూడా ఉందని ఆయన డీఎన్ఏ పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 
 
ఇదే అంశంపై సివిల్ ఆస్పత్రి ఏడీఎంఎస్ డాక్టర్ రజనీష్ పటేల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 31 మంది వ్యక్తుల డీఎన్ఏ సరిపోలింది. వారిని గుర్తించాం. వీరిలో 12 మృతదేహాలను ఉదయ్‌పూర్, వడోదర, ఖేడా, కుషీనగర్, అహ్మదాబాద్‌లలోని వారి స్వస్థాలకు పంపించాం అని తెలిపారు. మిగిలినవారి ఆప్తుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు మరికొన్ని కుటుంబు ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇతరుల డీఎన్ఏ ఫలితాలు ఇంకా రావాల్సి వుందన్నారు. 
తర్వాతి కథనం
విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత