శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (12:13 IST)

విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేసావె ట్రైలర్ (వీడియో)

హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ''ఏ మంత్రం వేసావె'' ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. ''అర్జున్ రెడ్డి'' హిట్‌తో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్

హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ''ఏ మంత్రం వేసావె'' ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. ''అర్జున్ రెడ్డి'' హిట్‌తో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ''గేమింగ్ అతని ప్రపంచం. గాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్" అంటూ ఓ యువతి చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

అమ్మాయిలంటే తనకు కేవలం ఆటబొమ్మలేనని, వారితో తాను ఆడుకుంటానని ''గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెమ్" చెప్పే డైలాగ్ యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అలాగే  ''డోంట్ నో ఎబౌట్ లవ్. బట్ షీ మేక్స్ మీ ఫీల్ సమ్ థింగ్ ఇన్ సైడ్" అన్న విజయ్ డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తోంది. ఈ ట్రైలర్‌ను మీరూ చూడండి.