సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (16:36 IST)

అర్జున్ రెడ్డి కొత్త వివాదం: సీన్లోకి అనసూయ.. జబర్దస్త్ స్కిట్ కంటే తక్కువేనన్న ఫ్యాన్స్..

అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే పోస్టర్ల వివాదం.. విడుదలయ్యాక రొమాంటిక్ సన్నివేశాలపై డైలాగులపై రచ్చ రచ్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అర్జున్ రె

అర్జున్ రెడ్డి సినిమాపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే పోస్టర్ల వివాదం.. విడుదలయ్యాక రొమాంటిక్ సన్నివేశాలపై డైలాగులపై రచ్చ రచ్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అర్జున్ రెడ్డి సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ అర్జున్ రెడ్డి సినిమాపై నిషేధం విధించాలని విజయవాడలో మహిళా కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. రాజు-యువరాజ్ థియేటర్ దగ్గర మహిళా సంఘం అర్జున్ రెడ్డి సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అర్జున్ రెడ్డి సినిమాలో వైద్య వృత్తిని కించపరిచే సన్నివేశాలున్నాయని.. వైద్యులను దారుణంగా తక్కువ చేసే సన్నివేశాలు, డేటింగ్, కిస్సింగ్ సీన్స్, డగ్ర్ వాడటం పిచ్చ పిచ్చగా వున్నాయని.. చివర్లో సందేశం పెట్టినా ప్రయోజనం లేదన్నారు. ఈ చిత్రం ద్వారా యువత తప్పుదారి పట్టే అవకాశం ఉందని మహిళా కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. వెంటనే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. 
 
మరోవైపు అర్జున్ రెడ్డి సినిమాపై ఇటు తెలంగాణ, అటు ఏపీలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సినిమాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువత పెడదారి పట్టేలా ఉన్న ఈ సినిమాను నిర్మించిన యూనిట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆయన కోరారు.
 
అర్జున్ రెడ్డి సినిమా రాజకీయ నేతలు మండిపడుతుంటే.. మరోవైపు హాట్ యాంకర్, జబర్దస్త్ స్టార్ యాంకర్ అనసూయ కూడా యాంటీగా స్పందించింది. ఈ సినిమాలో డైలాగుల గురించి ఇష్యూ చేయదలచుకోలేదని.. అయినా చెప్పకుండా వుండలేకపోతున్నానని చెప్పింది. అర్జున్ రెడ్డిలో తల్లిని తిట్టడం ఏమిటని ట్విట్టర్ ద్వారా అనసూయ ట్వీట్ చేసింది. 
 
అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయినా.. మరోవైపు వివాదాలు సైతం చుట్టుముట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో అనసూయ కూడా సీన్లోకి రావడం నెట్టినింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో హీరో వాడిన బూతు పదాల పట్ల మండిపడుతూ ట్వీట్ చేశారు. తల్లిని ఉద్దేశించి హీరో ఎవరినో తిడుతూ అభ్యంతరకర పదాలు వాడాడని, అలాంటివి వినలేమని తన ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. 
 
లక్షలాది మంది అర్జున్ రెడ్డి సినిమా కొనియాడటం గొప్ప అంటూనే ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లను తప్పుపట్టింది. "అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి అంతా బాగానే ఉంది కానీ అమ్మను తిట్టడం కూడా ఓకేనా? ఇదొక ప్రయోగం అంటున్నారు. కరెక్టేనా.. అయితే ఇలా చేయొచ్చునని ఎలా అనుకుంటారని అనసూయ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇది చాలా చీప్‌గా ఉందంటూ ట్వీట్ల వర్షం కురిపించింది.

అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెకు కౌంటర్ ఇస్తూ.. మీ జబర్దస్త్ షోలో మహిళలను కించపరిచే విధంగా స్కిట్లు ప్రదర్శించడం లేదా అని ప్రశ్నించారు. ఆ షోను మించిన పదాలు ఈ చిత్రంలో ఏమున్నాయని అడుగుతున్నారు.