శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2017 (14:48 IST)

నగ్న చిత్రాలకు ఒక్క అడుగు దూరం... అదే వర్మ 'చేతిలో కొబ్బరిచిప్ప'

'అర్జున్ రెడ్డి' చిత్రంలో ఏం సందేశం వున్నదనో కానీ చాలామందికి ఆ చిత్రం తెగ నచ్చేసిందట. ముఖ్యంగా కుర్రకారు ఎగబడుతున్నారట. దీనికి కారణం... పెళ్లి కాకుండానే ముద్దులు పెట్టడం, టీనేజ్ దాటిన మగాడు ఎలాబడితే అలా... క్రమశిక్షణ అనేది లేకుండా అమ్మాయిలంటే గౌరవం ల

'అర్జున్ రెడ్డి' చిత్రంలో ఏం సందేశం వున్నదనో కానీ చాలామందికి ఆ చిత్రం తెగ నచ్చేసిందట. ముఖ్యంగా కుర్రకారు ఎగబడుతున్నారట. దీనికి కారణం... పెళ్లి కాకుండానే ముద్దులు పెట్టడం, టీనేజ్ దాటిన మగాడు ఎలాబడితే అలా... క్రమశిక్షణ అనేది లేకుండా అమ్మాయిలంటే గౌరవం లేకపోవడం... ప్రేమించిన ప్రేయసిని పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ చేయడం... గట్రా వంటి పనులు చాలా నచ్చేశాయేమో. 
 
కుర్రకారుకి ఈ చిత్రం ఇలా వుంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి చిత్రం వర్మ చేతిలో కొబ్బరిచిప్పలా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి హీరో విజయ్‌ను వర్మ ఏకంగా హాలీవుడ్ హీరో అంటూ పొగడ్తలు జల్లు కురిపించడం చూస్తుంటే ఇక టాలీవుడ్ నగ్న చిత్రాలకు ఒక్క అడుగు దూరంలోనే వున్నట్లు అనిపిస్తుంది. టాలీవుడ్ పంథాను మార్చేసే అర్జున్ రెడ్డి వంటి సినిమాలు రావాలంటూ వర్మ పిలుపునివ్వడం చూస్తుంటే... ఇక బస్సులు మీద, హోర్డింగుల్లో లిప్ టు లిప్ లాక్ ముద్దులే కాదు.... సెక్స్ చేసే సన్నివేశాల తాలూకు పోస్టర్లు కూడా వెలుస్తాయేమో...?
 
ఎందుకంటే... హాలీవుడ్ స్థాయికి ఎదగాలి కదా. మొత్తానికి తేజ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నట్లు 'సర్వనాశనం అయిపోయింది చూశారా..'లా తయారైంది పరిస్థితి. మరి ఈ అర్జున్ రెడ్డి ముద్దు సీన్లన్నీ కట్టగట్టి వీహెచ్‌కు పంపితే ఆయన చిల్ అవుతారంటున్న రాంగోపాల్ వర్మ ఇక అంతకన్నా చిల్లింగ్ చేసే సినిమాలను తీసి ఆయనే చిల్ చిల్ చిల్ చిల్ అవుతారేమో... అది కూడా అర్జున్ రెడ్డి హీరోను పెట్టి. ఇక ఊహించుకోవడం మీ ఇష్టం.