శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2017 (20:07 IST)

అనసూయ 'షో' చూసే ప్రేక్షకులే వుండరా? కాస్త చెక్ చేస్కుంటే మంచిదేమో?

బుల్లితెర నటి అనసూయ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారంటే తన దుస్తులపై ఓ నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినందుకే. అతడు కామెంట్ చేస్తూ... అన‌సూయ‌కు ఏమైనా సెన్స్‌ ఉందా? అని కామెంట్ చేశాడు. ఈ ఎక్స్‌

బుల్లితెర నటి అనసూయ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారంటే తన దుస్తులపై ఓ నెటిజన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినందుకే. అతడు కామెంట్ చేస్తూ... అన‌సూయ‌కు ఏమైనా సెన్స్‌ ఉందా? అని కామెంట్ చేశాడు. ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటి? అని నిల‌దీశాడు. కుటుంబంతో కలిసి తాము టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నామ‌ని పేర్కొన్నాడు. ఆ కామెంట్ చూసిన అన‌సూయ‌కు చిర్రెత్తుకొచ్చింది.
 
దీనిపై అనసూయ స్పందిస్తూ 'అలాగైతే ఆ ప్రోగ్రాంల‌ను చూడ‌కు అంటూ సలహా ఇచ్చింది. కుటుంబ విలువలపై అంతగా పట్టింపు ఉన్న వ్య‌క్తి ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదని హిత‌వు ప‌లికింది. ఇతరులు ఎటువంటి దుస్తులు వేసుకోవాలో ఇలా చెప్ప‌కూడ‌ద‌ని పేర్కొంది. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన త‌న‌లాంటి పబ్లిక్‌ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను తీసుకోవ‌ద్ద‌ని ఘాటుగా క్లాస్ పీకింది. తాను ఏ దుస్తులు వేసుకోవాలో త‌న‌కు తెలుస‌ని, మ‌నుషులు ఏం చూడాలనుకుంటే అదే చూస్తారని తెలిపింది. 
 
చిన్నారుల‌పై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయని, 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని అనసూయ ప్ర‌శ్నించింది. వారేం ఎక్స్‌పోజింగ్ చెయ్య‌రు క‌దా? అని నిల‌దీసింది. ఇత‌రులకు ఇటువంటి సూచ‌న‌లు చేయొద్ద‌ని, 'నీ ప‌ని నువ్వు చూసుకో' అని చురక అంటించింది. కానీ సదరు నెటిజన్ ఇచ్చిన సలహాపై అనసూయ మరీ ఈ స్థాయిలో క్లాస్ పీకడమే చర్చనీయాంశంగా మారింది. 
 
పెద్ద తెర అంటే ఏదో రెండు మూడు గంటలు ఓర్చుకుని వెళ్లిపోతారు. అంతగా అయితే అసలు సినిమాకే వెళ్లరు. కానీ బుల్లితెర అలాక్కాదు కదా. కుటుంబం అంతా టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు. అలాంటప్పుడు దుస్తులు కాస్త కురుచగా వుంటే పిల్లల ముందు చూడటం ఇబ్బందిగానే వుంటుంది. మరి ఇలాంటి పాయింటును అనసూయ కాస్త పాజిటివ్ గా తీసుకుంటే బెటరేమోనన్న వాదన వినబడుతోంది. అలాక్కాకుండా ఇలాగే స్పందిస్తే ఇక ఆమె షోలను చూసే ప్రేక్షకులు వుండరేమోనన్న వాదన కూడా బయలుదేరింది. మరి అనసూయ తన గొంతు సవరించుకుంటుందో లేదో చూడాలి.