శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:03 IST)

''అర్జున్ రెడ్డి''కి ఆ 40 నిమిషాల ఫుటేజీని కలుపుతారట..?

అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ''అర్జున్‌రెడ్డి''ని దర్శకుడు సందీప్ రెడ్డి డైరక్ట్ చేశారు. ఈ సినిమా నుంచి ఎడిట్‌ చేసిన 40 నిమిషాల సన్నివేశాల్

అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ''అర్జున్‌రెడ్డి''ని దర్శకుడు సందీప్ రెడ్డి డైరక్ట్ చేశారు. ఈ సినిమా నుంచి ఎడిట్‌ చేసిన 40 నిమిషాల సన్నివేశాల్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నిడివి 182 నిమిషాలు ఉంది. అంటే 3 గంటలన్న మాట.

కానీ కొన్ని పరిమితుల కారణంగా మల్టీప్లెక్సుల్లో సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో  సినిమాను మూడు గంటలకు కుదిరించారట. సినిమా నిడివిని  పొడిగించాలనుకుంటున్నామని, 40 నిమిషాల ఎడిటింగ్ ఫుటేజీని మళ్లీ కలపాలనుకుంటున్నట్లు విజయ్ దేవర కొండ అన్నారు. ఈ కట్ చేసిన ఫుటేజీ కథకు ఎంతో కీలకమన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. అర్జున్ రెడ్డి సినిమా ఓ వైపు హిట్ టాక్‌తో దూసుకుపోతూనే మరోవైపు వివాదాల సునామీ సృష్టిస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ  భారీకల్లెక్షన్లు వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. హిందీలో అర్జున్ రెడ్డి పాత్రలో బాలీవుడ్ అగ్రనటుడు రణ్‌వీర్ సింగ్ నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.