మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (21:39 IST)

ముద్దు ఒక ఎమోషన్ అయితే సెక్స్ ఏంటి? 'అర్జున్ రెడ్డి'పై అనసూయ ప్రశ్న

అర్జున్ రెడ్డి వివాదం రావణ కాష్టంలా తగలబడుతుండటంతో ఆ సినిమాకు ఓ స్థాయిలో హైప్ పెరిగిపోయింది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రోజుకో సెలబ్రిటీ ఈ చిత్రాన్ని పొగడటమో లేదంటే తిట్టడమో చేస్తుండటంతో దాని స్థాయి దాటిపోయింది. మరోవైపు అర్జున్ రెడ్డి హీరో విజయ్ ద

అర్జున్ రెడ్డి వివాదం రావణ కాష్టంలా తగలబడుతుండటంతో ఆ సినిమాకు ఓ స్థాయిలో హైప్ పెరిగిపోయింది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రోజుకో సెలబ్రిటీ ఈ చిత్రాన్ని పొగడటమో లేదంటే తిట్టడమో చేస్తుండటంతో దాని స్థాయి దాటిపోయింది. మరోవైపు  అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అయితే తనదైన స్టయిల్లో పెద్ద హీరోలు చెప్పే డైలాగులు వల్లె వేస్తున్నాడు. 
 
ఇదిలావుంటే యాంకర్, నటి అనసూయ మరోసారి అర్జున్ రెడ్డి డైలాగులుపై మండిపడింది. ముద్దు ఒక ఎమోషన్ అయితే సెక్స్ ఏంటి? అంటూ ప్రశ్నించింది. ముద్దు ఒక ఎమోషన్ అయితే దాన్ని మించిన ఎమోషన్ సెక్స్ అని శెలవిచ్చింది అనసూయ. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా వుండలేరా... సమాజానికి ఇలాంటి మాటలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో వాడిన బూతు డైలాగును ఆడియో వేడుకకు వచ్చినవారితో పలికించడం దారుణమని తెలిపింది. తను చిత్రాన్ని చూడకపోయినా వారి మాటలతోనే జుగుప్స కలుతోందని చెప్పుకొచ్చింది.