మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (13:35 IST)

వీహెచ్‌కి రాంగోపాల్ వర్మ బలమైన 'కిస్'... 5 లక్షల మంది చూశారు...

కాంగ్రెస్ నేత వి.హెచ్.హనుమంతరావు, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మధ్య వివాదం ముదురుతోంది. యువ నటుడు విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో వీరి మధ్య వైరం మొదలైంది. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్లు లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోను పోస్టర్‌

కాంగ్రెస్ నేత వి.హెచ్.హనుమంతరావు, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మధ్య వివాదం ముదురుతోంది. యువ నటుడు విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో వీరి మధ్య వైరం మొదలైంది. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్లు లిప్ టు లిప్ ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోను పోస్టర్‌గా అంటించారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి పోస్టర్ బయట కనిపించడంతో కాంగ్రెస్ నేత వి.హెచ్.హనుమంతరావుకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆ పోస్టర్లను హైదరాబాద్‌లో చించేశారు. 
 
వి.హెచ్.పోస్టర్లను చించిన తరువాత సినిమాలోని వారి కన్నా రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ముద్దు పోస్టర్ అంటిస్తే తప్పేంటని వి.హెచ్.ను ప్రశ్నించారు. దీంతో వి.హెచ్.కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ ముద్దుల ఫోటోను చూస్తుంటే రాను రాను సెక్స్ ఫోటోను కూడా గోడలపై అంటిస్తారేమోనన్న భయాన్ని వ్యక్తం చేశారు. మాటలతో వర్మకు చురకలంటించారు. సెన్సార్ బోర్డు నిద్రపోతోందని వి.హెచ్. అంతెత్తు లేచి పడ్డారు. ఆ తరువాత సినిమా రిలీజైంది. వీరి మధ్య వివాదం మాత్రం అలాగే ఉండిపోయింది.
 
అయితే ఒక గుర్తు తెలియని వ్యక్తి వీరిద్దరి మధ్యా ఉన్న వ్యవహారాన్ని ఎడిట్ చేసిన ఫొటోను ఆర్జీవీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కూడా రాంగోపాల్ వర్మ వి.హెచ్.కు ముద్దు ఇస్తున్నట్లుగా. దీన్ని చూసిన రాంగోపాల్ వర్మ తన ఎఫ్‌‌బిలో వెటకారంగా పోస్ట్ చేశాడు. రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఫోటోను మూడుగంటల్లోనే 5 లక్షల మందికి పైగా చూశారట. ఇప్పుడు ఎఫ్‌‌బిలో రాంగోపాల్ వర్మ  ఫోటోనే హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై వి.హెచ్. ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.