1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. sai pallavi shocking comment on kiss scenes

సాయి పల్లవిని 'కిస్' ఇవ్వాలంటే ఏమన్నదో తెలుసా?

సాయి పల్లవి ఫిదా చిత్రంతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఫిదా చిత్రం తర్వాత ఆమెకు కోట్లలో పారితోషికం ఇస్తామంటూ చాలామంది నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నా కాదంటోంది. తనకు కథ నచ్చితేనే నటిస్తానని గట్టిగా చెపుతోంది. సినిమాల్లో తన కేరెక్టర్ ఏమిటన్నది చూసుకుని

sai pallavi
సాయి పల్లవి ఫిదా చిత్రంతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఫిదా చిత్రం తర్వాత ఆమెకు కోట్లలో పారితోషికం ఇస్తామంటూ చాలామంది నిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నా కాదంటోంది. తనకు కథ నచ్చితేనే నటిస్తానని గట్టిగా చెపుతోంది. సినిమాల్లో తన కేరెక్టర్ ఏమిటన్నది చూసుకుని ఒప్పుకుంటానని అంటోంది. గ్లామర్ ఆరబోత విషయంలో కూడా  చాలా నిక్కచ్చిగా వుంటానంటున్న ఈ భామ ఈమధ్య వరుసబెట్టి వచ్చిన ఆఫర్లన్నిటినీ కాదంటోంది. 
 
రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా తదితర తారామణులు ఎక్కడయినా షాపింగ్ ఓపెనింగ్స్ అంటూ ఒప్పేసుకుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం తను ఓపెనింగులకు కూడా రానని చెప్పింది. అంతవరకూ ఫర్వాలేదు... కానీ ఇటీవలే ఓ దర్శకుడు చెప్పిన కథ అంతా విని ఓకే చెప్పిందట. కానీ ఆ దర్శకుడు చివర్లో ఓ మాట చెప్పాడట. అదేమిటంటే... చిత్రంలో ఓ కీలక సన్నివేశం వుంటుందనీ, ఆ సన్నివేశంలో హీరోతో ఓ కిస్ ఇవ్వాల్సి వుంటుందని అన్నాడట. 
 
ఐతే.... ఈ చిత్రంలో నేను నటించనని చెప్పేసిందట. ముద్దులు, గ్లామర్ షోలు ఎట్టి పరిస్థితుల్లో చేయనని అంటోందట. కాబట్టి సాయిపల్లవి నటించాలంటే ఇవేవీ లేకుండా వున్న కథతోనే రావాలన్నమాట. అన్నట్లు సాయిపల్లవి నాని హీరోగా మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో నటిస్తోంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
శ్రీశైలం సమగ్రాభివృద్ధికి రూ.50 కోట్లు... కేంద్రం ప్రసాదం...(ఫోటోలు)