బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (11:00 IST)

సాయిపల్లవికి తెలివిలేదా?... క్రేజ్‌ను 'క్యాష్' చేసుకోవడం తెలియదట?

సాయిపల్లవి.. సాయిపల్లవి... ఇపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు. దీనికి కారణం "ఫిదా" చిత్రంలో ఆమె నటన. ఈ ఒక్క చిత్రంతో సాయిపల్లవికి ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతేనా.. టాలీవుడ్ హీరోయిన్లందరూ ఆ

సాయిపల్లవి.. సాయిపల్లవి... ఇపుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేరు. దీనికి కారణం "ఫిదా" చిత్రంలో ఆమె నటన. ఈ ఒక్క చిత్రంతో సాయిపల్లవికి ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతేనా.. టాలీవుడ్ హీరోయిన్లందరూ ఆమెను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. 
 
ఇలాంటి సమయంలోనే మిగతా హీరోయిన్లు తమ పారితోషికాన్ని విపరీతంగా పెంచేసి ‘దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా నడుచుకుంటారు. కానీ, సాయిపల్లవి మాత్రం తన రెమ్యునరేషన్‌ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చూసుకుంటోంది. 
 
ఫిదా చిత్రానికి ముందు సాయిపల్లవి ఒక చిత్రానికి తీసుకునే రెమ్యునరేష్ కేవలం రూ.30 లక్షలు మాత్రమే. ఈ సినిమా తర్వాత రూ.70 లక్షలు అడుగుతోందట. రెమ్యునరేషన్‌ తక్కువగా ఉండటం, ఆమె ఉంటే సినిమా హిట్‌ అన్న టాక్‌ రావడం ఇన్ని కారణాలతో టాలీవుడ్‌లో చిన్న పెద్దా దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట. 
 
అయినప్పటికీ.. తనకు వచ్చే అవకాశాలను క్యాష్‌ చేసుకోకుండా సాయిపల్లవి ఆచి తూచి వ్యవహరిస్తోందనీ, ఓ విధంగా చెప్పాలంటే సినిమా లెక్కలపై తెలివిలేకుండా వ్యవహరిస్తోందని కొందరు అంటున్నారు.