గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2017 (19:56 IST)

రైలులో తెలుగమ్మాయికి ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులు... దూకేసింది...

తెలుగు అమ్మాయిలపై ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చెన్నైలో ఈ రోజు ఉదయం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. రైలు జనరల్ బోగీలో ఖాళీ లేకపోవడంతో చెన్నైలో టెక్కీలకు పనిచేస్తున్న ముగ్గురు యువతులు ఎస్ 1 బోగీలో ఎక్కారు.

కొంతదూరం వచ్చాక బోగీలో వున్న ఉత్తరాది పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా దాటిన తర్వాత వారు మరింత రెచ్చిపోయి ముగ్గురు అమ్మాయిలపై లైంగిక దాడులు చేయబోయారు. దీనితో ఓ యువతి తప్పించుకుని సింగరాయకొండ స్టేషను వద్ద ప్లాట్ ఫాంపైకి దూకేసింది. దీనితో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే మిగిలిన యువతులు చైన్ లాగి రైలును ఆపేశారు. గాయపడిన యువతికి రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా పోకిరీలలో ముగ్గురిని విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.