శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:27 IST)

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వంపై కత్తితో దాడి?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత నమ్మినబంటు, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే తిరుగుబాటునేత ఓ పన్నీర్ సెల్వంపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో విమానాశ్రయంలో కొద్దిసేపు కలకలం చెలరేగింది. 
 
తొలుత అతడు విమానాశ్రయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురిచ్చితలైవి అమ్మ వర్గం అధినేత పన్నీరు సెల్వంతో ఫొటో దిగాలనుకున్నాడు. అందుకు అక్కడున్న భద్రతా బలగాలు అనుమతించలేదు. దాంతో అతడు కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ యువకుడిని తిరుచ్చి జిల్లా మున్నారుపురంకు చెందిన వాడిగా గుర్తించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు.