శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (14:58 IST)

ఆ వీధి కుక్కలు నా దేశభక్తిని శంకించడమా? కీరవాణి ఆగ్రహం

సోషల్ మీడియా వేదికగా చేసుకుని తనపై విమర్శలు గుప్పించిన నెటిజన్లపై సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మండిపడ్డారు. తనను విమర్శించిన వారిని వీధి కుక్కలతో పోల్చారు. ఎపుడూ ప్రశాంతవదనంతో కనిపించే కీరవాణి ఇంతలా మం

సోషల్ మీడియా వేదికగా చేసుకుని తనపై విమర్శలు గుప్పించిన నెటిజన్లపై సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మండిపడ్డారు. తనను విమర్శించిన వారిని వీధి కుక్కలతో పోల్చారు. ఎపుడూ ప్రశాంతవదనంతో కనిపించే కీరవాణి ఇంతలా మండిపడటానికి గల కారణాలను పరిశీలిద్ధాం. 
 
బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మితపై సెప్టెంబరు ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం ‘పైసా వసూల్’. ‘పైసా వసూల్’ థియేటర్లలో బాలయ్య అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ ఎంతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. "జైహింద్" అన్నంత ఆనందంగా, ఉత్సాహంగా ‘జై బాలయ్య’ అని నినదిస్తున్నారు’ అని అన్నారు. 
 
ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు మండిపడ్డారు. జై బాలయ్య నినాదాని జై‌హింద్‌తో ఎలా పోల్చుతారంటూ మండిపడ్డారు. కొందరు నెటిజన్లు అయితే, కుల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. దీనిపై, కీరవాణి ఘాటుగా స్పందించారు. ‘అర్జున్ రెడ్డి’ యూనిట్‌ను కులం కోసమే తాను ప్రశంసించానా? అని ప్రశ్నించారు. ఫేక్ డిస్ ప్లే పిక్ (డీపీ) పెట్టుకునే వీధి కుక్కలు తన దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ కీరవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.