శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (01:52 IST)

ట్విట్టర్ తెరిచినందుకు సిగ్గుగా ఉందట నిజమేనా?

గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలు జరిగిన నాటినుంచి ఆ చిత్ర దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణకు నిద్రపట్టడం లేదట. ఎందుకంటే పొరపాటునో గ్రహపాటునో ఆ వేడుకల్లో భాగంగా జై బాలయ్య అని నినదించిన నేరానికి క్రిష్‌కు కులరాజకీయాల బురద అంటుకుంది.

గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలు జరిగిన నాటినుంచి ఆ చిత్ర దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణకు నిద్రపట్టడం లేదట. ఎందుకంటే పొరపాటునో గ్రహపాటునో ఆ వేడుకల్లో భాగంగా జై బాలయ్య అని నినదించిన నేరానికి క్రిష్‌కు కులరాజకీయాల బురద అంటుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయమై చిరంజీవి అభిమానులు క్రిష్‌ను ఇప్పటికే ఒక ఆట ఆడేసుకున్నారు. ఈ రోజుకీ కూడా ఆ దాడులనుంచి తప్పించుకోవడం క్రిష్‌కి సాధ్యం కాలేదట.
 
అభిమానులు, వ్యతిరేకుల గోల ఎలాగూ తప్పదనుకుంటే తమ్మారెడ్డి భరద్వాజ వంటి టాలీవుడ్‌లో గౌరవనీయ స్థానంలో ఉన్న ప్రముఖుడు కూడా గౌతమీపుత్ర శాతకర్ణి స్టేజీపై అలా జై బాలయ్యా అని అరవటం ఏం బాగా లేదబ్బాయ్ అని మందలింపుగా వ్యాఖ్యానించడంతో క్రిష్ తీవ్రంగా ఫీలవుతున్నాడని తెలిసింది. ఉత్సాహం తట్టుకోలేకనో అభిమానుల్లో జోష్ నింపాలనో పొరపాటున జన్మానికి ఒక మాట అంటే చిన్న, పెద్ద వారందరినుంచి ఇలా అక్షంతలు పడతున్నాయేంటని క్రిష్ తెగ ఫీలవుతున్నాడట.
 
చివరకు తన తప్పేమీ లేదని సమర్థించుకుండూ సోషల్ మీడియాపై తప్పు నెట్టేశాడు క్రిష్. ఇన్నేళ్ల సినీ జీవితంలో ఏరోజూ తనలో కుల భావాలు లేవని, అగ్రహీరోల మూర్ఖ అబిమానులు తనను కులరాజకీయాల మురికిలోని నన్ను లాగొద్దని క్రిష్ వాపోతున్నాడు. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరిపై తనకు అత్యంత గౌరవభావముందని, క్రిష్ చెప్పుకున్నాడు కూడా. 
 
 అయితే ట్విట్టర్‌లో ఇతర సోషల్ మీడియాలో మాటల్లో వర్ణించలేనంత ఘోరమైన తిట్లు, బూతులకు లంకించుకుంటున్న యువతరాన్ని చూస తనకు దిగ్భ్రాంతి కలుగుతోందని, ఒకవైపు విద్యావంతులమని చెప్పుకుంటూ మరోవైపు బూతు భాషను నిర్భయంగా ప్రయోగిస్తున్న వారిని చూస్తే ట్విట్టర్ ఎందుకు ప్రారంభించానా అని సిగ్గుగా ఉందని క్రిష్ ప్రకటించేశాడు. కులం ప్రాతిపదికన సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న వారు అటు బాలయ్యకు కానీ, ఇటు చిరంజీవికి కాని నిజమైన అభిమానులు కారు పొండని క్రిష్ తృణీకరించేశాడు. 
 
క్రిష్ మాటల్లోని బాధను అలా పక్కన పెట్టండి... బాలయ్య, చిరు అభిమానులకు ఇప్పటికైనా తత్వం బోధపడుతోందా లేదా అనేదే అసలు విషయం.