బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (10:32 IST)

#Baahubali2PreReleaseEvent : 'ఎవ్వడంట ఎవ్వడంట.. బాహుబలి తీసింది'... కీరవాణి ప్రసంగం... రాజమౌళి కంటతడి... (Video)

బాహుబలి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి... చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుకకు హైలైట్‌గా నిలిచింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ సినిమాకు కేవలం సంగీతం అందించడమే కాకుండా, పాటలు రాసి, వాటిని

బాహుబలి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి... చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుకకు హైలైట్‌గా నిలిచింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ సినిమాకు కేవలం సంగీతం అందించడమే కాకుండా, పాటలు రాసి, వాటిని పాడే అవకాశం కూడా వచ్చిందని చెప్పిన ఆయన ‘బాహుబలి’లో తను పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్‌ను అనుకరిస్తూ రాజమౌళిపై ఓ పాట పాడారు. 
 
'ఎవ్వడంట ఎవ్వడంట.. బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవ్వడూ కనందీ, ఎక్కడా వినందీ.. శివుని ఆన అయ్యిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యిందీ' అంటూ పాడుతూ రాజమౌళిని స్టేజిమీదకు పిలిచారు. రాజమౌళి వస్తుంటే.. ‘పరుగెత్తుకు రా’ అంటూ గద్దెంచాడు. ఆ మాటకు నిజంగానే రాజమౌళి పరుగెత్తుకు వెళ్లారు. అతిథులు, ఆహూతులు అందరూ గౌరవంగా లేచి, చప్పట్లు కొట్టారు. రాజమౌళి కళ్లు చెమర్చాయి. పాట కొనసాగించారు కీరవాణి. 
 
‘పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో.. ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగువాడిగా..’ అంటుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు రాజమౌళి. ‘చిరాయువై యశస్సుతో ఇలాగె సాగిపొమ్మని.. పెద్దన్న నోటి దీవెన శివుణ్ణి కోరు ప్రార్థన’ అని పాడుతూ సోదరుడ్ని ఆలింగనం చేసుకున్నారు. రాజమౌళి కన్నీరు తుడుచుకున్నారు. పాట అయ్యాక ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అని ‘తమ్ముడిని పొగడకూడదు. దీవించాలి’ అంటూ రాజమౌళిని రిలాక్స్‌ అవ్వమని కిందకు పంపించారు కీరవాణి. ఈ కార్యక్రమంలో కీరవాణి ప్రసంగమే హైలెట్‌గా నిలిచింది.