ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 4 సెప్టెంబరు 2017 (16:26 IST)

వామ్మో.. 'అర్జున్ రెడ్డి'పై సమంత పొగడ్తలు... అతడితో నటిస్తుందా?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు అర్జున్ రెడ్డి హాట్ టాపిక్. ఎవరిని కదిపినా అర్జున్ రెడ్డి సినిమా గురించే చర్చ. బూతుల పోస్టర్లతో మొదటి నుంచి వివాదాల్లో నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ తరువాత అంతకు రెట్టింపయ్యింది. మద్యం సేవించి డాక్టర్ ఆపరేషన్ చేయడ

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు అర్జున్ రెడ్డి హాట్ టాపిక్. ఎవరిని కదిపినా అర్జున్ రెడ్డి సినిమా గురించే చర్చ. బూతుల పోస్టర్లతో మొదటి నుంచి వివాదాల్లో నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ తరువాత అంతకు రెట్టింపయ్యింది. మద్యం సేవించి డాక్టర్ ఆపరేషన్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం, పెళ్ళి కాకుండానే కడుపులు చేయించుకోవడం, వల్గర్ సీన్స్ ఇలా.. ఒక్కటి కాదు కుటుంబ సభ్యులతో కలిసి అస్సలు సినిమాను చూడలేమని దీన్ని బట్టే అర్థమవుతుంది.
 
అలాంటి సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకు మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేని విజయ్ ఇప్పుడు ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ సినిమాపై ఇప్పటికే మహిళలు మండిపడుతుంటే మరికొంతమంది సినీప్రముఖులు మాత్రం మెచ్చేసుకుంటున్నారు. రాంగోపాల వర్మ మాత్రం ఈ సినిమా సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్, సమంతలిద్దరూ ఈ సినిమాలో నటించిన విజయ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 
 
సినిమా కంటే సినిమాలో నటించిన విజయ్ క్యారెక్టర్ తమకు బాగా నచ్చిందంటూ చెప్పారు. సమంత అయితే... తనకు విజయ్ యాక్టింగ్ చాలా బాగా నచ్చిందనీ, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో విజయ్ రాణిస్తున్న తీరు నచ్చిందని పొగడ్తలతో ముంచెత్తిందట. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో విజయ్ పైన సమంత చేసిన వ్యాఖ్యలే హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు... ఈ అర్జున్ రెడ్డి హీరోతో సమంత యాక్ట్ చేస్తుందేమోనన్న చర్చ కూడా జరుగుతోంది.