1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Give us whole body, not partial remains : Families of Ahmedabad plane crash victims; 2 heads found in 1

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

plane crash
యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల గుర్తింపు ప్రక్రియ ఓ అగ్నిపరీక్షగా మారింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 241 ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో మృతులను గుర్తించి, వారి బంధువులకు అప్పగించడం ఇపుడు ఓ సవాల్‍‌గా మారింది.

ఇదిలావుంటే, ఒకే డెడ్ బాడీ బ్యాగులో రెండు తలలు లభ్యం కావడం ఇపుడు డీఎన్ఏ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చే అవకాశముంది. దీంతో డీఎన్ఏ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరీక్షకు కనీసం 72 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, తమవారి శరీర భాగాలను తమకు అప్పగించాలని మృతుల కుటుంబాలు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో అప్పగింతకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు అంటున్నారు. 
 
ఇదిలావుంటే అహ్మదాబాద్ నగరంలోని సివిల్ ఆస్పత్రి పోస్టుమార్టం గది వెలుపల హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. తమవారి పూర్తి శరీర భాగాలను అంత్యక్రియల నిమిత్తం అప్పగించాలని ఓ వ్యక్తి అధికారులను ప్రాధేయపడటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అయితే, మృతదేహాలు బాగా కాలిపోయివున్నందువల్ల అది సాధ్యం కాదని ఆయనకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున అన్ని శరీర భాగాలను వెలికితీసి ఇవ్వగలమని మేము కుటుంబాలకు హామీ ఇస్తున్నాం అని ఓ అధికారి తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. 
తర్వాతి కథనం
ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?