శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (11:59 IST)

దేశం కోసం జట్టుతో కలిసి వెళ్తుంటే.. విరాట్ కోహ్లీ ట్వీట్

దేశం కోసం జట్టుతో కలిసి మైదానంలోకి వెళుతుంటే ఆ క్షణాలు ఎంతో ఉద్విగ్నభరితంగా ఉంటాయంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్

దేశం కోసం జట్టుతో కలిసి మైదానంలోకి వెళుతుంటే ఆ క్షణాలు ఎంతో ఉద్విగ్నభరితంగా ఉంటాయంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ... ఓ ట్వీట్ చేశాడు.
 
నిజానికి ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘ పర్యటనలో ఉన్న భారత్‌ క్రికెట్‌ జట్టు తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఇదే ఇంగ్లీష్‌ గడ్డపై విఫలమై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న టీంఇండియా.. మళ్లీ అదే కథ పునరావృతం అవుతుందేమోనని అనుకున్నారంతా. కానీ ఐర్లాండ్‌పై రెచ్చిపోయి ఆడి సిరీస్‌ కైవసం చేసుకున్న కోహ్లీ సేన.. అదే జోష్‌తో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టేసింది. 
 
ఇదిలావుండగా, సహచరులతో కలిసి ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు పంచుకుంటున్న కెప్టెన్‌ కోహ్లీ.. తాజాగా ఓ ఆసక్తికర చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దానితోపాటు 'దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి అడుగుపెడుతున్న క్షణాలు ఎంతో ఉద్విగ్నమైనవని.. ఆ సమయంలో అభిమానులు అందించే ప్రోత్సాహం గురించైతే మాటల్లోనూ చెప్పలేమంటూ' ఉద్వేగంతో రాసుకొచ్చాడు. దీనిని చూసిన నెటిజన్లు కూడా ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.