సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (09:54 IST)

'విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. ఐ వాజ్ ఇన్ సెవెన్త్ క్లాస్' : పవన్ ట్వీట్ వైరల్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీ కూడా పవన్ కళ్యాణ్ ఏడో తరగతి చదివే సమయంలో తన అన్నలు, అక్కలతో కలిసి దిగిన ఫోటోతో ఆయన చేసిన ట్వీట్ మెగా ఫ్

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీ కూడా పవన్ కళ్యాణ్ ఏడో తరగతి చదివే సమయంలో తన అన్నలు, అక్కలతో కలిసి దిగిన ఫోటోతో ఆయన చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
 
తన తోబుట్టువులతో ఉన్న ఫోటోను గురువారం (జూలై-5) ట్విట్టర్‌లో పవన్ పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌‍లో ఉన్న ఈ ఫొటోలో పవన్ తన అన్నలు, అక్క, చెల్లితో ఉన్నారు. ఈ ఫొటో గురించి పవన్ వివరిస్తూ, అది నెల్లూరులో తీసుకున్న ఫొటో అని, అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నాని చెప్పారు. 
 
బ్రాంకైటిస్ (శ్వాసనాళము వాపు వ్యాధి)తో బాధపడుతూ కోలుకుంటున్న సమయంలో తీసుకున్న ఫొటో అదని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అక్క మాధవీ రావు, చెల్లెలు విజయదుర్గ ఉన్నారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ ఫోటోలో పవన్ హాఫ్ నిక్కర్ వేసుకుని వుంటే మెగా బ్రదర్స్ మాత్రం ఫ్యాంటు వేసుకుని ఉన్నారు.