గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (14:45 IST)

రేణూకు శ్రీరెడ్డి బాసట.. నేను నోరుతెరిస్తే పవన్ ఫ్యాన్స్ పరువు...

రెండో పెళ్లి చేసుకోనున్న నటి రేణూ దేశాయ్‌కు క్యాస్టింగ్ కౌచ్‌తో మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి మద్దతు ప్రకటించింది. 'ఉవ్ సపోర్ట్ రేణూ దేశాయ్' అంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

రెండో పెళ్లి చేసుకోనున్న నటి రేణూ దేశాయ్‌కు క్యాస్టింగ్ కౌచ్‌తో మంచి పబ్లిసిటీ కొట్టేసిన నటి శ్రీరెడ్డి మద్దతు ప్రకటించింది. 'ఉవ్ సపోర్ట్ రేణూ దేశాయ్' అంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా, రేణుగారూ మీరు నిజంగానే నోరు విప్పితే మీ మాజీ భర్త పవన్ కళ్యాణ్ పాపులారిటీ నిజంగానే మురికి కాలువలో కొట్టుకుని పోతుందంటూ వ్యాఖ్యానించారు. పైగా, ఓ మహిళగా తాను రేణూకు మద్దతిస్తున్నట్టు తెలిపింది.
 
కాగా, తన ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్.. మరో సోష‌ల్ నెట్‌వ‌ర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో కొంద‌రు ఆమెకు ఉచిత స‌ల‌హాలు ఎక్కువ‌గా ఇస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో తాను బ్లాస్ట్ అయి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. 
 
ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నందుకు కృత‌జ్ఞ‌త‌గా ఉండి, నా ప‌ట్ల కాస్త మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాల‌ని ఆమె కోరారు. విడాకుల గురించి అసలు విష‌యం చెబితే అవివేకులైన అభిమానుల పొగ‌రు మురికి కాల‌వ‌లో కొట్టుకుపోతుంద‌ని హెచ్చరించారు.