శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (09:33 IST)

పవన్‌తో విడాకులపై నేను నోరు విప్పితే.. ఫ్యాన్స్ పొగరు మురికి కాలువలో?: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌పై సినీనటి రేణూ దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకే ఫ్యాన్స్ మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పవన్‌తో విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు మౌనంగా వున్నానని.. అలా వున్నం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌పై సినీనటి రేణూ దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకే ఫ్యాన్స్ మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పవన్‌తో విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు మౌనంగా వున్నానని.. అలా వున్నందుకు పవన్ ఫ్యాన్స్ కృతజ్ఞతగా వుండాలన్నారు. పవన్ అభిమానులకు మర్యాద తెలియదని, అవివేకులని దుయ్యబట్టారు. తనను ట్రోల్ చేయడం ఇకనైనా మానుకోవాలని రేణూ దేశాయ్ హెచ్చరించారు. 
 
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి ప్రవేశించి ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానాలని వార్నింగ్ ఇచ్చారు. విడాకుల వ్యవహారంపై తాను కనుక నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన పవన్ అభిమానులకు గర్వం ఇట్టే అణిగిపోతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకే ఫ్యాన్స్ నెగిటవీటిని భరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. అసలు తానేంచేశానని వాటిని భరించాలని రేణూ దేశాయ్ ప్రశ్నించారు.
 
కాగా, నటి రేణూ దేశాయ్ తన రెండో పెళ్లి విషయం ప్రకటించినప్పటి నుంచి ట్విట్టర్ ద్వారా నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో, తన ట్విట్టర్ ఖాతాను రేణూ దేశాయ్ ఇటీవలే డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, రేణూను అభిమానించే వారు ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతా ద్వారా ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ''మీకు పెళ్లయిన తర్వాత కూడా పవన్‌తో టచ్‌లో ఉంటారా? అనే ప్రశ్నకు రేణూ దేశాయ్ ఇలా స్పందించారు. తప్పకుండా ఉంటానని.. ఎందుకంటే.. అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు ఆయన తండ్రి.. పిల్లల భవిష్యత్ కోసం ఆయనతో టచ్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు లేదా ఏవైనా వేడుకలు, వచ్చినప్పుడు పిల్లలిద్దరూ ఆయన దగ్గరకు వెళతారని రేణూ తెలిపారు.