గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జూన్ 2018 (12:26 IST)

పవన్ కళ్యాణ్ కుటుంబం ఇదే... అకీరా, ఆద్యలు ఇక పవన్ వద్దే వుంటారా?

రేణూ దేశాయ్ నిశ్చితార్థం జరిగిపోయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. వరుడు ఎవరో పెళ్లి తర్వాత మీకు తెలుస్తుందంటూ ఆమె తన అభిమానులకు చెప్పారు. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ సంతానం అకీరా, ఆద్య ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో కలిసి దేవాలయంలో పూజలు చేశారు. మర

రేణూ దేశాయ్ నిశ్చితార్థం జరిగిపోయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. వరుడు ఎవరో పెళ్లి తర్వాత మీకు తెలుస్తుందంటూ ఆమె తన అభిమానులకు చెప్పారు. ఇదిలావుంటే పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ సంతానం అకీరా, ఆద్య ఇద్దరూ పవన్ కళ్యాణ్‌తో కలిసి దేవాలయంలో పూజలు చేశారు. మరోవైపు రేణూ దేశాయ్ పెళ్లికి ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఇకపై అకీరా-ఆద్యల బాధ్యత పవన్ కళ్యాణ్ చూసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 
 
ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక చాలా ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె నిశ్చితార్థం కూడా ఇటీవలే జరిగింది. ఆ తర్వాత ఆమెపై ట్విట్టర్లో ట్రోలింగ్ ఎక్కువైంది. దీనితో ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసుకున్నారు. 
 
తాజాగా అకస్మాత్తుగా ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో దర్శనమిచ్చారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారంటే... " నన్ను హాయ్ వొదిన అని పిలిస్తే నా కాబోయే భర్త నీకు అన్నయ్య అవుతాడు. నేను ఇప్పుడే కాదు... ఎప్పుడూ హ్యాపీగానే వుంటాను. మా పిల్లలు అకీరా, ఆద్య చాలా సంతోషంగా వున్నారు. కొందరు సారీ వొదినా అని పోస్టులు పెడుతున్నారు... నాకు ఎందుకు సారీ.
 
కొంతమంది వున్నారు ఏ పనీపాట లేనివారు, అలాంటివారు పనికిరాని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో 10 పర్సెంట్ బ్యాడ్ పర్సన్స్ వున్నారని నాకు అర్థమైంది. పెళ్లి తర్వాతే నా భర్తను చూపిస్తా. నాకు మూడు రోజుల నుంచి విపరీతంగా మంచి సందేశాలు వస్తున్నాయి. అందరికీ పర్సనల్‌గా కృతజ్ఞతలు చెపుతాను. నాకు అమ్మాయిల కంటే అబ్బాయిల నుంచే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. నేను చేస్తున్న మేము సైతం జూలై 1న వస్తుంది. చూడండి" అని రేణూ దేశాయ్ లైవ్ చేస్తున్నంతసేపు గాలి(పవన్) ఆగలేదు మరి.