శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : బుధవారం, 4 జులై 2018 (14:42 IST)

వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం.. పవన్ సిఎం... ఎవరు?

రానున్న ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రజా సమస్యలపై ముందుకెళుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటిం

రానున్న ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే ప్రజా సమస్యలపై ముందుకెళుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు‌. దీంతో ఎపిలో త్రిముఖ పోటీ తప్పనిసరి అని అందరూ భావించారు. అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో తన ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉంటుంది. మొదటి స్థానంలో జనసేన, రెండవ స్థానంలో వైసిపి, మూడవ స్థానంలో టిడిపి ఉండిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం లేకపోలేదని, పవన్ కళ్యాణ్‌ సిఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ఇదిలావుంటే ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తనకు రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించే అధికారం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. మరి ఏపీ ప్రజలు అధికారం ఇస్తారో లేదో చూడాలి.